అతని నేల ... అతని పాలన.. ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్ పోస్టర్ ఔట్

by సూర్య | Fri, May 20, 2022, 03:13 PM

కేజీఎఫ్ 1,2 లతో దేశవ్యాప్తంగా సంచలనమైన దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో సలార్ ను రూపొందిస్తున్నాడు. ఆపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో సినిమాకు కమిటైన ప్రశాంత్, ఈ రోజు తారక్ బర్త్ డే ను పురస్కరించుకుని ఎన్టీఆర్ 31 పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో సినిమాలను చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నేడు తారక్ బర్త్ డే కాబట్టి ఎన్టీఆర్ 30పై కొరటాల శివ నందమూరి అభిమానులకు బర్త్ డే ట్రీట్ ను నిన్ననే ఇచ్చారు. తాజాగా ప్రశాంత్ నీల్ కూడా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్ 31నుండి తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో తారక్  కళ్ళకు కాటుక పెట్టుకుని, చాలా కోపంగా కనిపిస్తున్నాడు. రక్తంతో తడిచిన నేల ఎప్పటికీ గుర్తుంటుంది. అతని నేల ... అతని పాలన.. అతని రక్తం మాత్రం కాదు ... అంటూ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 పోస్టర్ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఫెరోషియస్ గా ఉన్న తారక్ రగ్డ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చూస్తుంటే, కొరటాల, ప్రశాంత్ నీల్ ల రెండు సినిమాల కూడా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా కనిపిస్తున్నాయి.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM