అందుకే మంచి ఆఫర్లని కూడా మిస్‌ చేసుకున్న : మృణాల్‌ ఠాకూర్‌

by సూర్య | Tue, Apr 30, 2024, 01:47 PM

మృణాల్‌ ఠాకూర్‌.. తమ పేరెంట్స్ విషయంలో ఆవేదన వ్యక్తం చేసింది. పేరెంట్స్ పెట్టిన కండీషన్స్ వల్లే తాను చాలా ఆఫర్లు కోల్పోయానని చెబుతూ షాకిచ్చింది.  మృణాల్‌ ఠాకూర్‌ వరుస పరాజయాలకు `ఫ్యామిలీ స్టార్‌` బ్రేక్‌ వేసింది. కానీ ఈ అమ్మడి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తుంది. అయితే కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందీ బ్యూటీ. కొన్ని కండీషన్స్ కూడా చాలా ఆఫర్లు దూరమవ్వడానికి కారణమవుతుందని చెప్పొచ్చు. మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌ అయ్యింది. `సీతారామం` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత చాలా ఆఫర్లు ఆమెని వరించాయి. కానీ ఆమె చేయలేదు. చాలా సెలక్టీవ్‌గా వెళ్లింది. దానికి పెద్ద కారణమే ఉందట. దానికి కారణం తమ పేరెంట్సే అని చెప్పింది. వాళ్ల కండీషన్ల కారణంగానే ఆమె అన్ని సినిమాలు చేయలేకపోతున్నట్టు తెలిపింది మృణాల్‌కెరీర్‌ ప్రారంభంలో మృణాల్‌కి చాలా ఆఫర్లు వచ్చాయట. అయితే అందులో ముద్దు సీన్లున్నాయని, అవి తమ పేరెంట్స్ కి ఇష్టం లేదని తెలిపింది. ముద్దు సీన్ల కారణంగానే తాను చాలా ఆఫర్లని కోల్పోయినట్టు తెలిపింది మృణాల్‌. తమ పేరెంట్స్ అలాంటి ఇంటిమేట్‌(రొమాంటిక్‌) సీన్లని ఎంకరేజ్‌ చేసేవారు కాదని, ఆ విషయంలో వాళ్లు కండీషన్స్ పెట్టేవారని తెలిపింది. 


 


అలా లిప్‌ లాక్‌ సీన్లు ఉండటం వల్ల మంచి ఆఫర్లని కూడా మిస్‌ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో చాలా అవకాశాలు తనకు రాకుండా పోయాయని చెప్పింది. అయితే లేట్‌గా అయినా ఈ విషయంలో తాను రియలైజ్‌ అయ్యానని, కంటెంట్‌ ఉంటే, ముద్దు సీన్‌కి బలమైన కారణం ఉంటే తాను చేయోచ్చని తాను నిర్ణయించుకున్నానని, ఆ విషయంలో పేరెంట్స్ ని కూడా కన్విన్స్ చేస్తున్నానని తెలిపింది మృణాల్‌. మృణాల్‌ ఠాకూర్‌.. నానితో `హాయ్‌ నాన్న`, విజయ్‌ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాల్లో ముద్దు సీన్లు చేసింది. లిప్‌ లాక్‌లతో రెచ్చిపోయింది. అయితే వీటిలో `హాయ్‌ నాన్న` బాగానే ఆడింది. కానీ ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరిచింది. యూత్‌ అంశాలు లేకపోవడంతో యువత ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి చూపించలేదు. పైగా స్లో నెరేషన్‌ కూడా దెబ్బతీసింది. పూర్తి ఫ్యామిలీ స్టోరీగా దీన్ని రూపొందించారు. అయితే ఓటీటీలో ఈ మూవీకి మంచి స్పందన లభిస్తుండటం విశేషం. మృణాల్‌ ఠాకూర్‌ `సీతారామం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఆ తర్వాత `హాయ్‌ నాన్న`, `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాల్లో మెరిసింది. అంతకు ముందు హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసింది. అందులో `జెర్సీ` రీమేక్‌ కూడా ఉంది. అందులోనూ లిప్‌లాక్‌లు పెట్టింది మృణాల్‌. కానీ ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం హిందీలో ఓ మూవీ చేస్తుంది మృణాల్‌. తెలుగులో చర్చల దశలో ఉన్నాయి. 

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM