by సూర్య | Fri, May 17, 2024, 07:35 PM
వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ టర్బో అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
ఈ చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.