'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర

by సూర్య | Fri, May 17, 2024, 06:57 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఈ సినిమా సీక్వెల్‌కి సాలార్: పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ మరో రెండు నెలల్లో సాలార్ 2ని సెట్స్ పైకి తీసుకువెళుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM
నేడు విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ Sat, Mar 14, 2026, 04:23 PM
రెండోసారి తల్లైన నటి పూర్ణ Sat, Mar 14, 2026, 04:22 PM
'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'బూకీ' Sat, Mar 14, 2026, 04:22 PM
అనసూయ పై తప్పుడు పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్ట్ Sat, Mar 14, 2026, 04:19 PM