త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ?

by సూర్య | Fri, Oct 25, 2024, 08:13 PM

ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన నటీమణుల్లో వనిత విజయ్ కుమార్ ఒకరు. తో చాలా మంది పాపులర్ అవుతుంటే ఈ అమ్మడు మాత్రం వ్యక్తిగత విషయాలతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది.ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది వనిత విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఎన్నో ల్లో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు తమిళ్ భాషల్లో లు చేసి ఆకట్టుకున్నారు విజయ్ కుమార్. ఇక వనిత విషయానికొస్తే తమిళంలో విడుదలైన 'చంద్రలేఖ' ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం ల్లో నటించింది. అలాగే తెలుగులో దేవి తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె చేసిన లు తక్కువే కానీ ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేస్తూ ఉంటుంది. ఆ వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. తెలుగులో దేవి తర్వాత తిరిగి చివరిగా సీనియర్ నరేష్ నటించిన మళ్లీ పెళ్లి లో నటించింది వనితా. కాగా ఇక ఈ అమ్మడి వ్యక్తిగత విషయానికొస్తే.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే ఈ మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. అలాగే స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతోనూ ఆమె వివాదం పెట్టుకుంది. వీటితో పాటు చాలా కాంట్రవర్షల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.


2000 సంవత్సరంలో హీరో ఆకాష్‌ను తొలిసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి విజయ్ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆనంద్‌ అనే బిజినెస్ మెన్‌ను రెండో పెళ్లి చేసుకుంది వనిత. ఈ ఇద్దరికీ జయనిత్ అనే కొడుకు పుట్టాడు. పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది అతనితో కూడా విడిపోయింది. అయితే ఇప్పుడు వనిత విజయ్ కుమార్ కూతురు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ చిన్నది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమెను చూసి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీని పై వనిత విజయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కుమార్తె జోవిక ను ల్లో పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నా.. ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.


 


 

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM