త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ

by సూర్య | Fri, May 17, 2024, 07:43 PM

బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్‌బికె 109 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క రెండు షెడ్యూల్‌లు పూర్తయ్యాయి. 2024 ఎన్నికలతో బిజీగా ఉన్న బాలకృష్ణ కాస్త విరామం తీసుకున్నారు. ఇప్పుడు ఓటింగ్ పూర్తి కావడంతో బాలకృష్ణ మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి బాబీ వారం రోజుల షెడ్యూల్‌ని ప్లాన్ చేశాడని, బాలకృష్ణ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నాడని సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
సత్యదేవ్ కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ Tue, Apr 22, 2025, 07:01 PM
భారీ మొత్తానికి అమ్ముడయినా 'జన నాయగన్' థియేట్రికల్ హక్కులు Tue, Apr 22, 2025, 06:54 PM
'పెద్ది' పై బుచి బాబు సనా కీలక వ్యాఖ్యలు Tue, Apr 22, 2025, 05:38 PM
'RAPO22' ఫస్ట్ సింగల్ విడుదలపై లేటెస్ట్ బజ్ Tue, Apr 22, 2025, 05:28 PM
ఒక ట్విస్ట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న 'హరి హర వీర మల్లు' Tue, Apr 22, 2025, 05:04 PM