బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం rx 100 బ్యూటీ సపోర్ట్

by సూర్య | Sat, Oct 23, 2021, 03:42 PM

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఇప్పటివరకు ఆరువారాల పూర్తి చేసుకుందీ షో. ఈ వారం హౌస్ మేట్స్ లో ఒకరు బయటకు వెళ్లనున్నారు. ఈసారి మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ లను కాపాడుకోవడానికి పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఇప్పటికే ప్రచారానికి దిగారు. అయితే ఓ కంటెస్టెంట్ కోసం ఏకంగా టాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగింది.తన ఫ్రెండ్ కి ఓటేయమంటూ జనాలను కోరుతోంది. ఆమె మరెవరో కాదు.. 'ఆర్ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామచంద్రకు తన మద్దతు తెలిపింది పాయల్. అతడికి ఓటేయమని అడుగుతూ.. 'నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు.. చాలా బాగా ఆడుతున్నాడు. కొన్ని ఎపిసోడ్స్ లో శ్రీరామ్ పెర్ఫార్మన్స్ చూస్తూ ఓ మై గాడ్ అనుకున్నాను.నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్ విషెస్ నీకెప్పుడూ ఉంటాయి' అంటూ చెప్పుకొచ్చింది. శ్రీరామ్ కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి.. ప్రతీ ఒక్క ఓటు కూడా విలువైనదే అంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్రీరామచంద్ర విషయానికొస్తే.. ఇంతకాలం హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్న అతడు హమీద వెళ్లిపోయినప్పటి నుంచి కాస్త డల్ అయ్యాడు. అతడికి స్క్రీన్ స్పేస్ కూడా పెద్దగా దొరకడం లేదు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM