'ఓఎమ్‌జీ 2' పోస్టర్‌ రిలీజ్‌

by సూర్య | Sat, Oct 23, 2021, 03:46 PM

2012లో విడుదలైన దాని హిందీ మాతృక 'ఓ మై గాడ్‌' మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో లీడ్‌ రోల్స్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ , పరేశ్‌ రావెల్‌ నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సిక్వెల్‌ రానుంది.మొదటి 'ఓఎమ్‌జీ'లో కృష్ణుడిగా కనిపించాడు అక్షయ్‌. కాగా ఈ సారి రాబోతున్న 'ఓఎమ్‌జీ 2'లో శివుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశాడు ఈ నటుడు. ఇంతకుముందు 'యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌' అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరో సోషల్‌ ఇష్యూతో రానున్నట్లు ఈ స్టార్‌ తెలిపాడు. దీనికి అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలని కోరాడు. 'ఈ జర్నీలో అందరినీ ఆ ఆదియోగి ఆశీర్వదిస్తాడు. హర హర మహదేవ్‌' అంటూ రాసుకొచ్చాడు.అయితే టాలీవుడ్‌ స్టార్స్‌ పవన్‌ కల్యాణ్‌, వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'గోపాల గోపాల' రీమేక్‌ అన్న విషయం తెలిసిందే.

Latest News
 
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. Thu, May 02, 2024, 12:41 PM
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM