నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

by సూర్య | Thu, May 02, 2024, 12:41 PM

కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. స్టార్ కూతురుగా తనకే ఆపరిస్థితి ఎదురైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? సీనియర్ హీరో శరత్ కుమార్  కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ,  శరత్‌కుమార్ తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారిపోయింది.  చెల్లిగా, అక్కగ నటిస్తూ.. విలన్ గా అవతారం ఎత్తింది. పవర్ ఫుల్ లేడీ విలన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.తెలుగులో క్రాక్, వీరసింహ రెడ్డి, నాంది.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. సౌత్ లోని అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికే 50 సినిమాలు పూర్తి చేసేసింది. ఈ తమిళ భామకు 38 ఏళ్ళు వచ్చినా పెళ్లి గురించి మాట్లాడేది కాదు. పెళ్లి గురించి అడిగినా సమాధానం చెప్పలేదు. తాజాగా నిశ్చితార్థం చేసుకొని ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరిచింది.మరో రెండు రోజుల్లో ‘శబరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. క్యాస్టింగ్ కౌచ్ గురించి  షాకింగ్  విషయాలు వెల్లడించింది. వరలక్ష్మి మాట్లాడుతూ.. “అమ్మాయిలు ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే అంత సులువు కాదు... ఈ విపయంలో వాళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవల్సి వస్తుంది అన్నారు. అందుకే మా  నాన్న గారికి నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు అన్నారు వరలక్ష్మీ.సినిమాలు అంటే నాకున్న  ఇష్టాన్ని ఆయన కాదనలేకపోయారు. నా నిర్ణయాన్ని గౌరవించారు. కాని స్టార్ హీరో కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాకు.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు తప్పలేదు.. నటిగా  బిజీ అవుతున్న రోజుల్లో ఓ సంఘటన జరిగింది. ఓ టీవీ ఛానల్ అధినేత మా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్ కోసం నన్ను  తీసుకోబోతున్నట్టు  అడిగాడు. దానికి నేను ఓకే అన్నాను. కానీ ఆ తర్వాత అతని బుద్ది తెలిసింది. మరో రోజు ఫోన్ చేసి.. మనం మళ్ళీ కలుద్దాం...ఇంట్లో వద్దు.. బయట కలుద్దామా.. రూమ్ బుక్ చేస్తాను.. మాట్లాడుకుందాం అని అన్నాడు. అతని దురుద్దేశం గ్రహించి అతడిపై కేసు పెట్టాను. 6 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన అది అంటూ.. తన కెరీర్ లో జరిగిన చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు వరలక్ష్మీ. స్టార్ హీరో కూతుర్నైన నాకే ఇలా ఉంటే సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అనిపించింది. అందుకే అప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ హీరో కూతురు అయినంత మాత్రాన నాకు అవకాశాలు వస్తున్నాయి అనేది నిజం కాదు.నన్ను కూడా చాలా మంది కమిట్మెంట్ అడిగారు. దాని వల్ల చాలా ఆఫర్స్ పోగొట్టుకున్నాను.  ఇలా కాస్టింగ్ కౌచ్ బాధితుల కోసం  సేవ్ శక్తి ఫౌండేషన్  ని స్థాపించాను. శక్తిగా పిలవబడే మహిళలను కాపాడటమే ఈ ఫౌండేషన్ యొక్క లక్ష్యం” అంటూ చెప్పారు వరలక్ష్మీ. 


 

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM