టీవీ యాక్టర్ కరణ్ మెహ్రా అరెస్ట్

by సూర్య | Tue, Jun 01, 2021, 03:33 PM

పాపులర్ హిందీ సిరీయల్ ‘యే రిష్‏కా క్యా కెహ్లతా హై’ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.  భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదు పై కరణ్ ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.  జూన్ 1న బెయిల్ మంజూరు అయ్యింది. కరణ్ మెహ్రా యే రిష్‏కా క్యా కెహ్లతా హై సిరీయల్ ద్వారా చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆరు సంవత్సరాల వరకు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత వీరిద్ధరు 2012లో వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరు విడిపోనున్నారని వార్తలు వచ్చాయి. నిషా కొద్ది రోజుల క్రితం స్పందించింది. తాము బాగున్నామని.. ఇలాంటి వార్తలను నమ్మకూడదు అంటూ చెప్పింది. కరోనా బారిన పడిన కరణ్ మెహ్రా కూడా.. క్లిష్ట పరిస్థితులలో తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని.. తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని తెలిపారు. వీరిద్ధరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి వీరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కరణ్ తన తలను గోడకు నెట్టేసినట్లు నిషా తన ఫిర్యాదులో పేర్కొంది.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM