సూర్య 40 వ మూవీ లుక్ రిలీజ్

by సూర్య | Fri, Apr 09, 2021, 04:18 PM

కోలీవుడ్ స్టార్ సూర్య ఇటీవలే 'సూరారై పొట్రు' సినిమాతో వచ్చి భారీ హిట్ అందుకున్నాడు. తెలుగులో ఈ సినిమా 'ఆకాశం నీ హద్దురా' పేరుతో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయగా తెలుగు ప్రేకకులను బాగానే ఆకట్టుకుంది. లేడీ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత భారీ కమర్షియల్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చిన సూర్య నెక్స్‌ట్ సినిమాని రీసెంట్‌గా సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 40గా రూపొందనుండగా పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'గ్యాంగ్ లీడర్', 'శ్రీకారం' సినిమాలతో టాలీవుడ్‌లో బాగా పేరు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ సూర్యకి జంటగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి దర్శకుడు పాండిరాజ్ సామాజిక అంశాలతో సూర్య ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమా సెట్స్‌లో అరీసెంట్‌గా సూర్య కూడా జాయిన్ అయ్యాడట. కాగా ఈ సినిమా నుంచి సూర్య కత్తి పట్టుకున్న లుక్ ఒకటి మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. 

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM