పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్

by సూర్య | Thu, May 02, 2024, 08:38 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ని పుష్ప పుష్ప అనే టైటిల్ తో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషలలో విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకరాం, ఈ సాంగ్ యూట్యూబ్ లో 1 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
తొలి టెలికాస్ట్ లోనే షాకింగ్ టిఆర్పిని నమోదు చేసిన 'బూట్‌కట్ బాలరాజు' Fri, May 17, 2024, 03:59 PM
'పుష్ప 2' యొక్క రెండవ సింగిల్ విడుదల ఎప్పుడంటే...! Fri, May 17, 2024, 03:56 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'విద్యా వాసుల అహం' Fri, May 17, 2024, 03:54 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఇంద్ర' Fri, May 17, 2024, 03:52 PM
బుక్ మై షోలో 'కల్కి 2898AD' జోరు Fri, May 17, 2024, 03:50 PM