ఆ జానర్‌కు చరమగీతం పాడేసిన ‘సైనా’బయోపిక్

by సూర్య | Fri, Apr 09, 2021, 04:04 PM

స్పోర్ట్స్ బయోపిక్.. కొన్నేళ్ల ముందు బాలీవుడ్లో మంచి గిరాకీ ఉన్న సినిమా. భారత అథ్లెటిక్స్ దిగ్గజం మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘బాగ్ మిల్కా బాగ్’.. ఆటల్లో అన్యాయానికి గురై బందిపోటుగా మారిన పాన్ సింగ్ తోమర్ మీద తీసిన ‘పాన్ సింగ్ తోమర్’.. ఎం.ఎస్.ధోని జీవిత నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ అద్భుత విజయాలు సాధించాక ఈ జానర్‌‌కు మాంచి డిమాండ్ ఏర్పడింది. వరుసబట్టి మరిన్ని స్పోర్ట్స్ బయోపిక్స్ అనౌన్స్ చేశారు. ఎవరి కథను తీస్తే, ఎలా తీస్తే ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు అని గుర్తించడంలో ఫిలిం మేకర్స్ విఫలమయ్యారు. సచిన్ మీద డాక్యుమెంటరీ తరహాలో ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ తీస్తే అది ప్రేక్షకులకు రుచించలేదు. మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా కూడా అంతగా ఆడలేదు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మీద తీసిన ‘సైనా’ అయితే ఈ జానర్‌కు దాదాపు చరమగీతం పాడేసిందని చెప్పొచ్చు. లెజెండరీ స్టేటస్ అందుకున్న ఒకప్పటి క్రీడాకారుల గురించి సినిమా తీయడం బాగుంటుంది. లేదంటే ఇప్పటి క్రీడాకారుల గురించి కూడా మనకు తెలియని విషయాలు చూపిస్తే సినిమా వర్కవుట్ అవుతంది. ఇప్పుడు ఆటలో కొనసాగుతున్న వ్యక్తుల జీవితాలను ఎమోషన్ లేకుండా, అందరికీ తెలిసిన విషయాలనే చూపిస్తే ఏం ఆసక్తి ఉంటుంది? ‘సైనా’ సినిమా విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో కనీస ఆసక్తి చూపించలేదు. ట్రైలర్ చూసినపుడే చాలా పేలవంగా అనిపించింది. కొత్తగా ఏమీ కనిపించలేదు. ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఈ దెబ్బకు ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్న సింధు, గోపీచంద్ లాంటి వాళ్ల బయోపిక్స్ సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే ఇవి పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగింది. ఇప్పుడు ‘సైనా’కు ఎదురైన పరాభవం చూశాక ఈ సినిమాలను ఆపేసినా ఆశ్చర్యం లేదు. 

Latest News
 
గురువారం NBK స్పెషల్ సినిమాలు Thu, Apr 25, 2024, 03:10 PM
భారీ బడ్జెట్ తో 'తమ్ముడు' యాక్షన్‌ సీక్వెన్స్‌ Thu, Apr 25, 2024, 03:05 PM
నేడు విడుదల కానున్న 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Thu, Apr 25, 2024, 03:04 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'రత్నం' Thu, Apr 25, 2024, 02:53 PM
2024లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చలనచిత్రాల లిస్ట్ Thu, Apr 25, 2024, 02:51 PM