18న విడుద‌ల కానున్న ర‌విబాబు -ఆవిరి

by సూర్య | Mon, Oct 07, 2019, 01:22 AM

న‌టుడిగా ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన మార్కుతో విజృంభించే ర‌విబాబు త‌న‌కంటూ ఇప్ప‌టికే  ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు . ప్ర‌స్తుతం ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`.  ఈ చిత్రంలో ఆమ‌న‌తో పాటు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన తారాగ‌ణం కాగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మిస్తోంది. కాగా  ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఆదివారం    ద‌ర్శ‌క నిర్మాత ర‌విబాబు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ``రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న ప్రేక్షకుల ముంద‌కు తీసుకువ‌స్తున్నాం. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా,థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది`` అన్నారు, కాగా `అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు చిత్రాల  చిత్ర జ‌య ప‌రాజ‌యాలు ఎలా ఉన్నా ద‌ర్శ‌కుడుగా ర‌విబాబు త‌న‌దైన ట్రేడ్ మార్కును ఏర్పాటు చేసుకున్నాడు. 


 


 

Latest News
 
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Thu, May 02, 2024, 08:40 PM
పుష్ప 2 : 1M+ లైక్స్ ని సొంతం చేసుకున్న 'పుష్ప పుష్ప' సాంగ్ Thu, May 02, 2024, 08:38 PM
'SSMB29' సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే ...! Thu, May 02, 2024, 08:36 PM
'ఇండియన్ 2' కోసం గ్లోబల్ స్టార్ Thu, May 02, 2024, 07:01 PM