వాళ్లు నాకు దొరికితే బట్టలూడదీసి కొడతా.. జగ్గారెడ్డి

byసూర్య | Sat, Oct 26, 2024, 07:23 PM

సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. మరోసారి కీలక కామెంట్లు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో మాట్లాడిన జగ్గారెడ్డి.. తనపై వస్తున్న ట్రోలింగ్ మీద ఘాటుగా స్పందించారు. ఈ మధ్య కొంతమంది సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల మీద కూడా సోషల్ మీడియా ముసుగులో కొందరు కాంగ్రెస్ వ్యతిరేకులు తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుల ప్రసంగాలను కూడా ఇష్టానుసారంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.


తాను ఓ మహిళా కలెక్టర్‌ను బూతులు తిట్టినట్లుగా సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెట్టారని జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ కలెక్టర్‌ను ఏమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తనపై ట్రోలింగ్ చేస్తే లీగల్ నోటీసులు అందుకోవాల్సిందేనని హెచ్చరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా మారిందని ఆరోపించారు. ఒకవేళ ట్రోలింగ్ చేస్తున్న వాళ్లు తన చేతికి దొరికితే మాత్రం.. బహిరంగంగానే బట్టలూడదీసి కొడతానంటూ జగ్గారెడ్డి తనదైన శైలిలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.


మరోవైపు.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావుకు ఈ మధ్య మతి పూర్తిగా భ్రమించిందని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారం దూరం అవ్వటంతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. నిత్యం ఏదో ఓ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పని మొదలుపెట్టి కేవలం 10 నెలలే అయ్యిందన్న జగ్గారెడ్డి.. ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారని.. ఇంకా నాలుగేండ్లు భరించాలన్నారు. ఇంకో ఐదేళ్లు కూడా అధికారంలో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నామని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.


"కేటీఆర్.. నీకు కొంచెం గౌరవం ఇస్తా.. కానీ మీ సోషల్ మీడియాను కంట్రోల్‌లో పెట్టు.. లేదంటే మా సంగతి తెలియదు.. కాంగ్రెస్ వాళ్లను కేటీఆర్ లుచ్చాలు అంటున్నాడు.. లుచ్చా లకే లుచ్ఛా కేటీఆర్. రేవంత్ చిట్టి నాయుడు కాదు గట్టి నాయుడు. రేవంత్ రెడ్డి తొడ కొడితే.. కేటీఆర్‌కి కాళ్లు వణుకుతున్నాయి. ధైర్యం చేయడంలో రేవంత్.. జగ్గారెడ్డితో కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడలేరు. మీ బావబామ్మర్థులు చిన్న పిల్లల చేష్టలు మానుకోవాలి. తప్పుడు రాతలు రాయిస్తే.. ఖైరతాబాద్ సెంటర్‌లో ముక్కు నేలకు రాయిస్తాం. నా మాటలు, సీఎం రేవంత్ రెడ్డి మాటలు మొరటుగా ఉంటాయి కానీ మంచివాళ్లం.." అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.



Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM