పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్..

byసూర్య | Sun, Oct 20, 2024, 10:53 PM

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుల్  గా పనిచేస్తూ ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 06 మంది అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) వారి కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్  పదోన్నతి చిహ్నంను అలకరించి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.... పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విదులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు.  ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం, మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి  ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్ లు, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం పాల్గొన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM