ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు

byసూర్య | Mon, Oct 21, 2024, 09:58 PM

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకులో సావెరిన్ గోల్డ్ బాండ్, ఆర్‌బీఐ బాండ్లు కొనుగోలు చేసిన వారికి కీలక సూచన చేసింది. ఇప్పటి వరకు వడ్డీ డబ్బులు రాని వారు, తమ బాండ్లు మెచ్యూరిటీ పూర్తయిన వారు, మెచ్యూరిటీ సమయానికి దగ్గరగా ఉన్న వారు వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి తమ బ్యాంక్ ఖాతాను వెరిఫై చేసుకోవాలని సూచించింది. అందుకు 5 రోజుల సమయం ఇచ్చింది. ఈ గడువులోపు వెరిఫై చేసుకున్న వారికి మాత్రమే గోల్డ్ బాండ్లు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బాండ్ల మెచ్యూరిటీ సొమ్ము, వడ్డీ సొమ్ము జమ అవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది.


'పంజాబ్ నేషనల్ బ్యాంకులో సావెరిన్ గోల్డ్ బాండ్లు లేదా ఆర్‌బీఐ బాండ్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా వడ్డీ రాని వారు, ఇప్పటికే మెచ్యూరిటీ పూర్తియిన వారు, మెచ్యురిటీ సమయానికి దగ్గర పడిన వారు 5 రోజుల్లోగా తమ బ్రాంచీకి వెళ్లి బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసుకోవాలి. తప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా క్లోజ్ అయిన అకౌంట్ నంబర్ ఉండి డబ్బులు వచ్చేందుకు ఏదైనా జాప్యం జరిగినప్పుడు బ్యాంక్ అందుకు బాధ్యత వహించదు. ఒకవేళ వడ్డీ లేదా అసలు ఆరేళ్ల వరకు క్లెయిమ్ చేసుకోకపోతే ఆర్‌బీఐ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే గోల్డ్ బాండ్ల రిడంప్షన్ పూర్తయ్యే వరకు తమ ఖాతాలను మూసి వేయొద్దు. ఏదైనా ఎమర్జెన్సీలో ఖాతా క్లోజ్ చేయాల్సి వస్తే అంతకు ముందే వేరొక ప్రత్యామ్నాయ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. దీంతో గోల్డ్ బాండ్ల రిడంప్షన్, వడ్డీ డబ్బులు జాప్యం కాకుండా జమ అవుతాయి.' అని పీఎన్‌బీ బ్యాంక్ పేర్కొంది.


రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. సావెరిన్ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ పూర్తయిన 30 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోకపోతే ఆ తర్వాత 7 రోజుల్లోగా ఆ డబ్బులను ఇఎస్సీఆర్ఓడబ్ల్యూ (ESCROW) అకౌంటుకు బ్యాంక్ బదిలీ చేస్తుంది. ఆ తర్వాత 7 ఏళ్లలోపు సైతం ఆ డబ్బులను ఎవరూ క్లెయిమ్ చేసుకోకపోతే వాటిని ఐపీఇఎఫ్ కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అలాంటి ఐపీఈఎఫ్ ఖాతాకు బదిలీ చేసిన అన్‌క్లెయిమ్డ్ డబ్బులను అర్హులైన వారు క్లెయిమ్ చేస్తే అన్ని వివరాలను తనిఖీ చేసి వారికి చెల్లిస్తారు. మరోవైపు.. సావెరిన గోల్డ్ బాండ్ల మెచ్యురిటీ పూర్తయ్యే నెల రోజుల ముందే రిడంప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మెచ్యురిటీ తేదీ రోజున అసలు, వడ్డీ కలిపి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఒక వేళ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ వంటివి మార్చుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే బ్యాంకు లేదా ఎస్‌హెచ్‌సీఐఎల్ లేదా పీఓలకు సమాచారం అందించాలి.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM