స్వేరోస్ నెట్వర్క్ నేషనల్ కన్వెన్షన్ మీటింగ్ విజయవంతం చేయండి

byసూర్య | Sun, Oct 20, 2024, 10:35 PM

సిద్దిపేట జిల్లా ప్రెస్ క్లబ్లో స్వేరోస్ నెట్వర్క్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 27-10-2024 రోజున బెజ్జంకి మండల కేంద్రములో జరగబోయే స్వేరోస్ నెట్వర్క్ నేషనల్ కన్వెన్షన్ మీటింగ్ ముఖ్య అతిథిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హాజరయ్యే మీటింగ్ ను విజయవంతం చేయుటకు గాను స్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరన్న  ముఖ్య అతిథిగా హాజరై స్వేరోస్ నెట్వర్క్ నేషనల్ కన్వెన్షన్ పురస్కరించుకొని వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న వారితో పాటుగా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యార్థులు, తల్లిదండ్రులకు, యువకులు అందరు కలిసి ఇట్టి మీటింగ్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇట్టి మీటింగ్ విజయవంతం చేయుటకు గాను జిల్లా స్వేరోస్ నెట్వర్క్ కమిటీ నాయకులు భాద్యతలు తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుర్గన్న  చీఫ్ కన్వీనర్, చిలకబత్తిని వీరన్న రాష్ట్ర అధ్యక్షులు, దారమల్ల ప్రకాష్  ప్రధాన కార్యదర్శి, బొర్ర సురేష్ కుమార్  రాష్ట్ర  సభ్యులు & ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్, మరియు PPL  ఉమ్మడి జిల్లా ఇంచార్జ్  కన్వీనర్ చాతలా సదానందం గడప రాజు లలిత రాణి రాష్ట్ర కమిటీ సభ్యులు. హాజరయ్యారు.కావున జిల్లాలోని సీనియర్ స్వేరో నాయకులు, ఇంతకు ముందు వివిధ కమిటీలలో పనిచేసిన స్వేరో నాయకులు, RSP అభిమానులు ప్రస్తుత జిల్లా నాయకులు అందరు స్వేరోస్ నెట్వర్క్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM