తెలంగాణలో మరో 4 లైన్ హైవే.. ఈ మార్గంలోనే, దూసుకెళ్లిపోవచ్చు

byసూర్య | Sun, Oct 20, 2024, 10:24 PM

తెలంగాణలో రహదారుల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న రహదారిని త్వరలోనే 6 వరుసలకు విస్తరించనున్నారు. కాగా, తెలంగాణలో మరో రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.


హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లే రహదారిలో కొత్తపల్లి (రాజీవ్‌ రహదారి) ప్రస్తుతం రెడు వరుసల రహదారి ఉండగా.. దాన్ని విస్తరించనున్నారు. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేదుకు తాజాగా రేవంత్ సర్కార్ ముందుకొచ్చింది. రహదారి విస్తరణకు అనేకసార్లు కేంద్రం వద్ద ప్రతిపాదనలు పెట్టినా.. స్పందించకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది. మొదటి దశలో భాగంగా రహదారి అభివృద్ధికి రూ.77.20కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రహదారులు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ తాజాగా జీవో జారీ చేశారు.


కొత్తపల్లి-హుస్నాబాద్‌-జనగాం నేషనల్ హైవే అభివృద్ధిపరచాలనే డిమాండ్‌ గత మూడేళ్లుగా ఉంది. కరీంనగర్‌-హుస్నాబాద్‌-జనగాం మీదుగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, సూర్యాపేట, ఏపీలోని విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు. కరీంనగర్‌ వైపు మంచిర్యాల, గోదావరిఖని, జగిత్యాల ప్రాంతాలకు వాహనాల రాకపోకలు ఈ రహదారిపై సాగుతుంటాయి. ఈ రహదారిని భారత్‌మాల పథకం కింద నేషనల్ హైవే అభివృద్ధికి మూడేళ్ల క్రితం ప్రతిపాదించినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్ర రహదారిగా అభివృద్ధి పరుస్తామని గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.


అందులో భాగంగా కరీంనగర్‌(కొత్తపల్లి)-హుస్నాబాద్‌ వరకు 4 లైన్ల రహదారిగా అభివృద్ధికి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. మెుదటి దశలో ఎండీఆర్‌ ప్లాన్‌ కింద ప్యాకేజీ-2లో రహదారిలో 11కి.మీ నుంచి 21కి.మీ వరకు 4 లైన్ నిర్మాణానికి రూ.77.20కోట్లకు తాజాగా పరిపాలన అనుమతులు మంజూరయ్యాయా. ఈ రహదారి 4 లైన్లుగా మారితే.. హుస్నాబాద్‌ నుంచి కరీంనగర్‌ రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతుంది. హుస్నాబాద్, కోహెడతో పాటు జనగాం, హనుమకొండ జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.


Latest News
 

మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి 4 వ వర్ధంతి Tue, Oct 22, 2024, 04:34 PM
మూలమలుపుల్లో వాహనాలు వెళ్లాలంటే నరకమే Tue, Oct 22, 2024, 04:33 PM
షనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:31 PM
నేషనల్ క్రైమ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ Tue, Oct 22, 2024, 04:23 PM
ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని ఎంపీకి వినతి Tue, Oct 22, 2024, 04:04 PM