దేవాలయాల నిర్మాణాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ : నీలం మధు ముదిరాజ్

byసూర్య | Sun, Oct 20, 2024, 07:59 PM

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం తున్కి ఖల్సా గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట...సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి గారితో కలిసి పాల్గొన్న నీలం మధు.అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం తున్కి ఖల్సా గ్రామంలో మత్స్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన స్థానిక ఇంచార్జ్ నర్సారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ శ్రేణులతో పాటు నీలం అభిమానులు మధుకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సర్వాంతర్యమి అయిన అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. నూతన దేవాలయాల నిర్మాణాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుందన్నారు.


గ్రామాల్లో అమ్మవారికి నిర్వహించే బోనాలు, జాతరల వంటి ఉత్సవాలతో ప్రజలందరి మధ్య ఐక్యమత్యం అలవడుతుందన్నారు.అమ్మవారి దయతో తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని అభిలాషించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు నీలం మధు కు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మోహన్, విద్యా కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సందీప్ రెడ్డి,కొండల్ రెడ్డి, సాయిగౌడ్, నర్సింహులు,రాజశేఖర్ రెడ్డి,శేఖర్,రవి,శ్రీను, ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM
మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం Wed, Oct 23, 2024, 07:42 PM