కుల గణనలో ముదిరాజులకు న్యాయం జరగాలి

byసూర్య | Wed, Oct 16, 2024, 09:39 PM

తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రంలో కుల గణన కార్యక్రమం బీసీ నిరుపేదలైన వారందరికీ సమన్యాయం చేకూరుతుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ పోలిట్ బ్యూరో సభ్యులు బానిస నారాయణ అన్నారు  మంగళవారము మండల కేంద్రమైన వట్ పల్లిలో జిల్లా ముదిరాజ్ నాయకుల సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్రం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు  కూడా రాష్ట్రంలో కులగణన చేసి నిరుపేదలను ఆదుకోవాలన్న యోచన గత ఏ ప్రభుత్వము కూడా చేయలేదని ఆయన అన్నారు ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజుల నీరు పేదలను ఆదుకోవాలన్న దృష్టితో కులగనలను తీసుకువచ్చిoదన్నారు అందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి యావత్ తెలంగాణ ముదిరాజుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర  ముదిరాజ్ కులస్తులు పేరు చివరన ముదిరాజ్ అని మార్చుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులు ప్రభుత్వానికి సంఖ్యాబలం తెలవాలన్న ముదిరాజు కులానికి ఆర్థికంగా రాజకీయంగా న్యాయం జరగాలన్న  ముదిరాజ్ కులస్తులందరూ పేరు చివరన తప్పనిసరిగా ముదిరాజ్ అని రాయించుకోవాలని సూచనప్రాయంగా బానిస నారాయణ తెలిపారు తెలంగాణ ముదిరాజ్ కులస్తులకు ఏవైనా సందేహాలు ఉంటే తమకు ఫోను చేయాలని ఆయన పేర్కొన్నారు పొన్ నంబర్ 8247262870 ఈ నెంబర్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జిల్లా నాయకులు బాగన్న ముదిరాజ్ రాములు ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ సంఘన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కానిస్టేబుల్ భార్యపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకునే స్థాయికి దిగజార్చారని విమర్శ Thu, Oct 24, 2024, 07:27 PM
కళ్యాణలక్ష్మి,సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేత Thu, Oct 24, 2024, 07:11 PM
మెడిసిటీ ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ లో ఉచిత వైద్యశిబిరం Thu, Oct 24, 2024, 07:10 PM
దేశ అభివృద్ధికి చిరునామాగా కేంద్రం పనిచేస్తుంది: ఎంపీ Thu, Oct 24, 2024, 07:09 PM
రెసిడెన్షియల్ స్కూల్‌లో ఆకస్మికంగా తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ Thu, Oct 24, 2024, 07:06 PM