చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు షాక్.. సగం తిన్నాక కనిపించింది చూసి

byసూర్య | Tue, Oct 15, 2024, 09:35 PM

కాసుల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు హోటల్ నిర్వహకులు కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఏ మాత్రం సుచీ, శుభ్రత లేకుండా నాసిరకం వంటకాలు విక్రయిస్తున్నారు. ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా.. హోటల్ నిర్వహకుల తీరు మారటం లేదు. ఇటీవల కాలంలో సాంబార్‌లో బల్లి, ఉప్మాలో ఈగ, పప్పులో బొద్దింక ఇలా అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


 కాజాగా.. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన ఓ కస్టమర్‌కు ఉహించని షాక్ తగిలింది. బిర్యానీ సగం తిన్న తర్వాత అందులో కనిపించింది చూసి ఖంగుతున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్- వరంగల్ హైవేపై భువనగిరి టౌన్ సమీపంలో ఓ ప్రముఖ రెస్టారెంట్ ఉంది. ఆ హైవే గుండా ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి ఆకలిగా ఉండటంతో హోటల్ వద్ద ఆగాడు. వెయిటర్‌ను పిలిచి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. కొద్ది సమయం తరువాత వెయిటర్ కస్టరమ్ ఆర్డర్ ఇచ్చిన చికెన్ బిర్యానీ తెచ్చి ఇచ్చాడు.


బాగా ఆకలిగా ఉన్న కస్టమర్ బిర్యానీ తినటం ప్రారంభించాడు. అయితే సగం బిర్యానీ తిన్న తర్వాత.. అందులో కనిపించింది చూసి ఖంగుతున్నాడు. బిర్యానీలో చనిపోయిన జెర్రీ ప్రత్యక్షమైంది. దీంతో షాక్‌కు గురైన కస్టమర్ వెంటనే హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జెర్రీని టిష్యూ పేపర్ లో పెట్టి.. హోటల్ సిబ్బందిని నిలదీశాడు. ఇదేంటని వారిని ప్రశ్నించగా.. హోటల్ సిబ్బంది అతడిని శాంతిపజేసే ప్రయత్నం చేశారు. మరోటి తెచ్చిస్తాం అంటూ ఆఫర్ చేశారు. అయినా వెనక్కి తగ్గని కస్టమర్ హోటల్ యజమానని పిలవాలని డిమాండ్ చేశారు. తాను ఫుడ్ సెఫ్టీ అధికారులతో పాటు మీడియాకు విషయం చెబుతానని తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల కాలంలో ఇటువంటి ఘటన అనేకం వెలుగులోకి వచ్చాయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇటువంటి హోటల్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM