byసూర్య | Tue, Oct 15, 2024, 10:43 AM
కోనుగొలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని చెప్పారు.
దళారుల వ్యవస్థ లేకుండా రైతులకు స్వయంగా న్యాయం చేయాలని ఉద్దేశంతోటే గ్రామీణ ప్రాంతాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని చెప్పారు. కార్యక్రమంలో ఏవో వసంతరావు, ఏపీఎం కిరణ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు మచ్చేందర్ రెడ్డి, రాజు, నర్సింలు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.