byసూర్య | Tue, Oct 15, 2024, 10:36 AM
భారాస అధినేత కేసీఆర్ ను శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్.. తన జన్మదినం సందర్భంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాలు చాలా బాగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. రవీందర్ యాదవ్ కు బర్త్ డే విషెస్ తెలిపి, శాలువాతో కేసీఆర్ సన్మానించారు.
రవీందర్ యాదవ్ కు మంచి భవిష్యత్ ఉందని, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న తీరును, శేరిలింగంపల్లిలోని పార్టీ వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నందుకు కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించినట్లుగా రవీందర్ యాదవ్ తెలిపారు. కష్టపడి పని చేసే వారికి పార్టీలో సరైన గుర్తింపు లభిస్తుందని కేసీఆర్ వెల్లడించారన్నారు. ప్రతి ఏడాది లాగే తమ అధినేత కేసీఆర్ ను కలిసి, తన జన్మదినంను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.