హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌

byసూర్య | Tue, Oct 15, 2024, 10:32 AM

హైదరాబాద్‌ మహా నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనను పెంచుతూ పోతోంది జీహెచ్‌ఎంసీ. ఓవైపు ఔటర్‌ రింగ్‌ అవతల అభివృద్ధి పరుగులు పెడుతోంది.ఇక నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా జీహెచ్‌ఎంసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నగరంలో పలు ఫ్లై ఓవర్లను నిర్మించారు.ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లో మరో అద్భుత నిర్మాణం జరగనుంది. పెరుగుతోన్న ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్‌లో అతిపెద్ద అండర్‌పాస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. ఈ అండర్‌పాస్‌ను కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మించనున్నారు. నగరంలో అత్యధికంగా ట్రాఫిక్‌ ఉండే ప్రదేశాల్లో కేబీఆర్‌ పార్క్‌ ఒకటి. అటు ఐటీ కారిడార్‌ను, ఇటు సికింద్రాబాద్‌ను కలిపే ఈ ప్రాంతంలో నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. దీంతో ఈ ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సిగ్నల్‌ అనేది లేకుండా ప్రయాణం సాగించేలా ఈ అండర్‌పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ -45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్ గేటు వైపు దాదాపు 740 మీటర్ల మేర అతిపెద్ద భూగర్భ అండర్‌పాస్ నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ అండర్‌పాస్ అందుబాటులోకి వస్తే.. ఐటీ కారిడార్‌, ఫిల్మ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు అండర్‌పాస్‌ నుంచి నేరుగా ప్రయాణం సాగించవచ్చు. ఇలా కేబీఆర్‌ పార్కు చుట్టూ మెుత్తం 7 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.ఇందులో భాగంగానే కేబీఆర్‌ పార్క్‌ మెయిన్‌ గేట్‌ చౌరస్తా వద్ద రూ.192 కోట్లతో రెండు అండర్‌పాస్‌లు, ఓ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే.. యూసుఫ్‌గూడ నుంచి వచ్చే వాహనాలు, జూబ్లీచెక్‌పోస్ట్‌ వైపు డైవర్ట్ అవుతాయి. అదే విధంగా జూబ్లీచెక్‌పోస్ట్‌ నుంచి వచ్చే వాహనాలు ఫ్రీ లెఫ్ట్‌ ద్వారా యూసుఫ్‌గూడ వైపు, కేన్సర్‌ హాస్పిటల్ వైపు వెళ్లాల్సిన వెహికల్స్ అండర్‌పాస్‌ ద్వారా వెళ్లొచ్చన్నమాట.


Latest News
 

కేసీఆర్ బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని వెల్లడి Thu, Oct 31, 2024, 10:33 PM
మూసీ ప్రాంతంలో కేసీఆర్, ఈటల రాజేందర్ ఉండాలన్న కాంగ్రెస్ నాయకులు Thu, Oct 31, 2024, 07:05 PM
ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు Thu, Oct 31, 2024, 05:21 PM
సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ Thu, Oct 31, 2024, 05:19 PM
మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ Thu, Oct 31, 2024, 05:16 PM