byసూర్య | Tue, Oct 15, 2024, 10:28 AM
తెలంగాణ రాష్ట్రంలో 60 రోజులలో ఎస్సీ ఏ,బి,సి,డి వర్గీకరణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ కమిషన్ కమిటీ చైర్మన్ కి మరియు అధికారులకు ఆదేశాలు జారీ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని దండోరా సీనియర్ నాయకులు ముదిగొండ ఎల్లేష్ మాదిగ అన్నారు.60 రోజులలో వర్గీకరణ జరిగితే మాదిగ , మాదిగ ఉప కులాల భవిష్యత్తు తరాల బిడ్డలు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి రుణపడి ఉంటారని అన్నారు. 30 ఏళ్ల పోరాటం, జైలు జీవితాలు, ఆత్మ బలిదానాలు, జీవితాలను త్యాగం చేసి పోరాడిన బిడ్డలు మాదిగ జాతి భవిష్యత్ తరాలకు అభివృద్ధిని అందించటానికి మాదిగ బిడ్డలు చేసిన పోరాటం చరిత్రలో మరువలేనిదని అన్నారు,జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని అన్నారు.తెలం కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సభలో సమావేశాలలో ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.