byసూర్య | Tue, Oct 15, 2024, 10:25 AM
వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపూర్ లోని దివ్య నవ్య రైస్ మిల్ కు రేషన్ బియ్యం తరలిస్తున్న మారుతి వ్యాన్ ను జిల్లా సీసీఎస్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మిల్లుకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని మిల్లుకు తరలిస్తున్నారని పక్క సమాచారంతో పోలీసులు మిల్లు సమీపంలో మాటు వేసి నిర్వహించిన దాడిలో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.