ఈ ప్రాంతాల మధ్య,,,,రాష్ట్రంలో కొత్త 4 లైన్ నేషనల్ హైవే

byసూర్య | Mon, Sep 30, 2024, 08:14 PM

తెలంగాణలో కొత్త రహదారుల నిర్మాణం, రోడ్ల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం సహా.. హైదరాబాద్-విజయవాడ విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రీజినల్ రింగు రోడ్డును రెండు భాగాలుగా 350 కి.మీ మేర నిర్మిస్తుండగా.. హైదరాబాద్-విజయవాడ హైవేను నాలుగు వరసల నుంచి 6 వరసలకు విస్తరించనున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక రాష్ట్రంలో మరో 4 లైన్ హైవే అందుబాటులోకి రానుంది.


సిద్దిపేట పట్టణం మీదుగా ఈ కొత్త 4 లైన్ నేషనల్ హైవే రూపుదిద్దుకోనుంది. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు రహదారి నిర్మించనున్నారు. రూ.1,100 కోట్ల వ్యయంతో జాతీయ రహదారుల విభాగం అంచనాలు రూపొందిస్తోంది. ఈ కొత్త రహదారి నిర్మాణానికి ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్‌ సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌లో కేంద్ర ఉపరితల రవాణాశాఖకు జాతీయ రహదారుల విభాగానికి ఈ డీపీఆర్ సమర్పించనుంది. ఇప్పటికే ఈ జాతీయ రహదారారికి కేంద్ర ప్రభుత్వం అనుమతించగా, అలైన్‌మెంట్‌ కూడా ఖరారైంది.


నేషనల్ హైవే 365 కి కొత్త రూపు ఇవ్వనున్నారు. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు 184 కి.మీ. మేర ఉన్న ఈ 365బీ రోడ్డును కేంద్రం విస్తరణ చేపట్టింది. ఈ రహదారిని నేషనల్ హైవేగా గుర్తించినా.. చాలా ఇరుకుగా ఉండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రహదారిని కేంద్రం విస్తరిస్తోంది. సూర్యాపేట నుంచి రాజీవ్‌ రహదారి మీదగా దుద్దెడ వరకు రెండు వరుసలుగా రోడ్డును 10 మీటర్లు విస్తరించింది. సూర్యాపేట నుంచి జనగామ వరకు గతంలోనే పనులు పూర్తి కాగా.. జనగామ నుంచి చేర్యాల మీదుగా దుద్దెడ వరకు ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. ఈ రహదారిని నాలుగు వరుసలుగా 20 మీటర్లు విస్తరించాలని డిసైడ్ అయింది.


ప్రస్తుతం 365బీ నేషనల్ హైవే చేర్యాల మీదుగా వచ్చి దుద్దెడ వద్ద రాజీవ్‌ రహదారితో కనెక్ట్ అవుతుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డులోనే భాగంగా కొనసాగనుంది. దుద్దెడ వద్ద రాజీవ్‌ రహదారిని క్రాస్‌ చేసి సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీసు వెనుక నుంచి కోమటి చెరువు సమీపంగా సిద్దిపేటకు చేరుతుంది. జక్కాపురం, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, తంగళ్లపల్లి గ్రామాల వద్ద బైపాస్‌లతో రోడ్డు నిర్మించనున్నారు. అనంతరం సిరిసిల్ల పట్టణం వద్ద మానేరు నది మీదుగా వంతెన నిర్మిస్తారు. మధ్యలో కొన్ని చిన్న వంతెనలు కూడా నిర్మించనున్నారు. ఈ రహదారులు అందుబాటులోకి వస్తే ఎటువంటి అవాంతరాలు లేకుండా దూసుకెళ్లిపోవచ్చు.



Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM