తెలంగాణ మినీ మాల్దీవులు.. తక్కువ బడ్జెట్‌లో హాలీడే ట్రిప్

byసూర్య | Mon, Sep 30, 2024, 08:08 PM

వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది టార్లకు ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎక్కడికి వెళ్లాలనే దానిపై ఓ క్లారిటీ ఉండదు. బడ్జెట్‌కు బయపడి చాలా మంది హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే వెళ్తుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో మాల్దీవులను చూసిన ఫీలింగ్ పొందడానికి నగరానికి సమీపంలోనే ఓ చోటుంది. అదే తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలవబడే సోమశిల. హైదరాబాద్‌కు దగ్గర్లో నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉంటుంది. నగరానికి 180 కి.మీ దూరంలో ఉన్న సోమశిల.. నదీ జలాలు, పచ్చని అడవుల మధ్య పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సోమశిలకు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా అవార్డు కూడా దక్కింది.


కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉండే సోమశిల ఒక ద్వీపం మాదిరిగా ఉంటుంది. కృష్ణా బ్యాక్‌వాటర్ ఉండటంతో సోమశిల మాల్దీవుల్లో ఉన్నట్లుగా ద్వీపం అనుభూతిని పంచుతుంది. తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు స్పెషల్ సదుపాయాలు కల్పిస్తున్నారు. టూరిజం శాఖ ద్వారా బోటింగ్ సదుపాయం కూడా ఉంది. అక్కడే బస చేయటానికి కాటేజీలు కూడా నిర్మించారు.


కృష్ణా నదీ తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్‌తో పాటుగా ప్రత్యేకంగా అక్కడ దొరికే చేప వంటకాలను రుచి చూడవచ్చు. ఈ ప్రాంతం నుంచి శ్రీశైలానికి బోటింగ్ ద్వారా చేరుకోవచ్చు. సోమశిలలో దాదాపు 15 దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?హైదరాబాద్‌ నుంచి సోమశిల ప్రాంతం 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్ హైవే 65పై నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సోమశిల గ్రామం ఉంటుంది. అక్కడకు చేరుకోవటానికి టూరిజం డిపార్ట్ మెంట్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఉంటాయి. సొంత వెహికల్స్‌లో చేరుకోవటం కూడా చాలా ఈజీ. హైదరాబాద్‌లో జర్నీ మెుదలు పెడితే 3 నుంచి 4 గంటలు ప్రయాణం చేసి చేరుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వీకెండ్‌లో సోమశిల టూర్‌కు ప్లాన్ చేసుకోండి.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM