కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది? : కేటీఆర్

byసూర్య | Mon, Sep 30, 2024, 08:05 PM

తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్‌ ఏదేదో చెప్పిందని.. తీరా అధికారంలోకి వచ్చాక ఇంకేదో చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు.మూసి బాధితుల పాలిట కాలయముడిలా సీఎం రేవంత్‌ రెడ్డి తయారయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మరోసారి ఆరోపించిన ఆయన.. హైడ్రా బాధితుల తరఫున పోరాడి తీరతామని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారాయన.తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది?. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంది. కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం అని ప్రకటించింది. ఎన్నికల ముందు తెలంగాణలో చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించారు.


హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట,ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పేదల ఇల్లు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ ఇందిరమ్మ,సోనియమ్మ చెప్పింది. వరి సాగులో తెలంగాణ టాప్ గా నిలిచింది ఇది కాళేశ్వరం ఘనత కాదా?. 2016లో బీఆర్ఎస్ హయాంలో చెరువులు, బఫర్, ఎఫ్.టి.ఎల్ డ్రా చేస్తూ జీవో ఇచ్చాం. మూసీలో మేము పేదల కడుపు కొట్టకుండా బ్యూటిఫికేషన్ చేశాం. ఎస్.టి.పి లు మేము పూర్తి చేశాం. మేము నిర్మాణం చేస్తే మీరు విధ్వంసం చేస్తున్నారు అంటూ పేర్కొన్నారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM