24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920

byసూర్య | Mon, Sep 23, 2024, 10:40 AM

బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ. 76 వేలకు చేరువైంది.దీంతో పసిడి ధర తర్వలోనే రూ. 80 వేల మార్క్‌కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తులం బంగారంపై రూ. 10 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ. 75,920 వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


 దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,740గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 76,070 వద్ద కొనసాగుతోంది.ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోది.


 చెన్నై విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోంది. దేశంలో మరో ప్రధాన నగరమైన బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోంది.


తెలుగు రాష్ట్రాల్లో..


తెలగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,590కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,590, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,920గా ఉంది.


Latest News
 

రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM
ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం Mon, Sep 23, 2024, 12:20 PM
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు Mon, Sep 23, 2024, 12:00 PM