ఏచూరిని కలిసినప్పుడల్లా వారే గుర్తొచ్చేవారు: సీఎం రేవంత్

byసూర్య | Sat, Sep 21, 2024, 09:52 PM

దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి.. పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఏచూరి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏచూరిని కలిసినప్పుడల్లా.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారని అన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారన్నారు.


నమ్మిన సిద్ధాంతం కోసమే చివరి శ్వాస వరకు నిలబడిన వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. ఆయన బ్రతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారన్నారు. మరణాంతరం కూడా ఉపయోగపడాలన్న కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. యూపీఏ హయాంలో పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన్ను మార్గానిర్దేశకుడిగా భావిస్తారన్నారు.


జమిలి ఎన్నికల అశంపైనా రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలన్న కుట్ర జరుగుతోందన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలనుకుంటున్న ఇలాంటి కీలక సమయంలో ఆయన లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరని లోటన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం బాధాకరణన్నారు. మనకు దిక్సూచిలా ఉండాల్సిన సమయంలో మన మధ్య లేకపోవడం చింతించాల్సిన సమయమన్నారు. సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని.. విద్యార్థి దశ నుంచే దేశ క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు.


ఏచూరి స్పూర్తితో స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ సూచించారు. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మాట్లాడితే ప్రధాని స్పందించకపోవడం వారి ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని మండిప్డడారు. అలాంటి భాషా ప్రయోగం చేసిన వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఇక అంతకు ముందు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏచూరి చిత్రపటానికి నివాళి అర్పించారు. పూటకో పార్టీ మార్చే నేటి రోజుల్లో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన గొప్ప వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. నేటి తరం తన లాంటి నాయకులకు ఆయన స్పూర్తి అని అన్నారు.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM