గాంధీ భవన్‌కు వైసీపీ ఎంపీ,,,,ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ శ్రేణులు

byసూర్య | Sat, Sep 21, 2024, 09:54 PM

హైదరాబాద్‌లోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గాంధీ భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. కొత్తగా ఎన్నికైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆ ఎంపీ ఏపీకి చెందిన వ్యక్తి కాదు.. తెలంగాణ ప్రాంతానికి చెందిన చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య.


బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అయిన ఆర్.కృష్ణయ్య గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్‌ను కలిశారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుండగా.. ఆర్. కృష్ణయ్య సడెన్‌గా అక్కడకు వచ్చారు. కొత్తగా పీసీసీ చీఫ్‌గా ఎంపికైన మహేశ్‌ కుమార్ గౌడ్‌ను ఆయన సన్మానించారు. అయితే పార్టీల తరపున కాకుండా.. ఓ బీసీ నేత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడైనందున బీసీ సంఘం తరఫున ఆయన మహేశ్‌ కుమార్ గౌడ్‌ను సన్మానించినట్లు తెలిసింది.


కాగా, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీల కులగణన చేపట్టాలని కూడా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కూడా ఈ అంశంపై తాజాగా మహేష్ కుమార్ గౌడ్‌తో చర్చించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరినట్లు తెలిసింది.


బీసీ హక్కుల కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఆర్. కృష్ణయ్య 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గొలుపొందారు. 2014-2028 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత కొంత కాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉండగా.. 2022లో తిరిగి వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావటంతో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించేందుకు నేడు గాంధీ భవన్‌కు వెళ్లినట్లు తెలిసింది.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM