పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఎల్‌పీజీ గ్యాస్‌ పథకం

byసూర్య | Sat, Sep 21, 2024, 03:02 PM

పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్‌ ధరను రూ.500కే అందజేస్తుందని జోగిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్‌ ఎ.చిట్టిబాబు అన్నారు.  జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్‌ పంపిణీ లబ్దిదారులను ఎంపిక చేస్తూ  ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారని.ఈ పథకం క్రింద లబ్దిదారురాలైన 17వ వార్డుకు చెందిన అత్తర్‌ భేగంకు పత్రాన్ని అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిది రేషన్‌ డీలర్‌ ఏరియాల్లో 2668 మంది లబ్దిదారులను ఎంపిక చేసిందన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే అధికారులను సంప్రదించాలన్నారు.
కాంగ్రేస్‌ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుందని ఎన్నికల సమయంలో ఆరుగ్యారంటీలపై ఇచ్చిన హమీల్లో మహాలక్ష్మి పథకంను అమలు చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలంతా సంతోషంగా ఉన్నారని, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. నియోజకవర్గ అభివృద్దికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో వార్డు ఇంచార్జ్‌ ప్రసాద్, ఇఫ్తకార్, ,ఖయ్యుమ్, ఆర్‌ పి అనిత, శాంత పాల్గొన్నారు.


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM