ఎట్టకేలకు కుక్కల దాడులపై జీహెచ్ఎంసీ స్పందన,,,,టోల్ ఫ్రీ నెంబర్లు ప్రకటించిన జీహెచ్ఎంసీ

byసూర్య | Thu, Jul 25, 2024, 09:47 PM

కుక్కల దాడులు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతుండటమో.. ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటమో.. హైకోర్టు మొట్టికాలయలు వేయటమో కానీ.. ఎట్టకేలకు జీహెచ్ఎంసీ అధికారుల్లో స్పందన కనిపించింది. ప్రజల డిమాండ్‌లు, హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుని.. కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఓ అడుగు వేసింది. ఈ మేరకు.. జీహెచ్ఎంసీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. "మీ ఏరియాలో కుక్కల బెడద ఉందా..? అయితే వెంటనే.. టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఒకే ఒక్క ఫోన్‌ కాల్‌తో సమస్యకు పరిష్కారం." అంటూ అధికారులు జీహెచ్ఎంసీ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


నగరంలో ఏ ప్రాంతంలో అయినా.. వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా.. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాల్ వచ్చిన వెంటనే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాగ్ క్యాచింగ్ టీంలు.. సదరు ఏరియాకు వచ్చి.. వీధి శునకాలను పట్టుకెళ్లి, సంరక్షణ కేంద్రాలకు తరలించటమే కాకుండా.. స్టెరిలైజేషన్ కూడా చేయనున్నట్టు తెలిపారు. దీంతో.. వీధుల్లో కుక్కల దాడులే కాదు.. వారి సంఖ్య కూడా తప్పే అవకాశం ఉంది. ఇంకేందుకు ఆలస్యం.. ఎవరెవరి వీధుల్లో కుక్కల బాధ ఉందో.. వాళ్లంతా వెంటనే పైన చెప్పిన నెంబర్లకు ఫోన్లు చేయండి. కుక్కల సమస్య నుంచి పరిష్కారం పొందండి.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM