తెలంగాణ బడ్జెట్‌లో ఇందిరా మహిళా శక్తి పథకం,,,డ్వాక్రా సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపు

byసూర్య | Thu, Jul 25, 2024, 06:03 PM

తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్‌లో బడ్జెట్‌లో వినూత్న పథకాలను ప్రతిపాదించింది. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా 63 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యం. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌‌లలో


మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనుంది.


  మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్‌ కేంద్రాలతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణ చేపడుతుంది. వచ్చే ఐదేళ్లలో 25,000 సంస్థలకు విస్తరింపచేయడానికి కృషి చేయనున్నారు.


దీంతో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద సభ్యురాలు మరణించినపుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 50.41 కోట్ల కేటాయించారు. ఈ పధకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా వర్తింపజేస్తారు.


స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్‌ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌కు) కు 3.20 ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.


అలాగే, మహిళా స్వయం సహాయక సంఘాల ఏటా కనీసం 20 వేల కోట్లకు తగ్గకుండా వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల వడ్డి లేని రుణాలు అందించాలని నిర్ణయించింది. మైక్రో, స్మాల్‌ ఇండిస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాకారం అందించనుంది. ఇక మొత్తం రూ. 2.91 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా పేర్కొంది.



Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM