మెట్రోకు, మహిళలకు, రైతులకు భారీ కేటాయింపులు,,,2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

byసూర్య | Thu, Jul 25, 2024, 05:57 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుుత్వం తరఫున 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో మొత్తం బడ్జెట్ రూ.2,91,159 లక్షల కోట్లు కాగా.. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. మొత్తం రూ.72,659 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. సంక్షేమానికి కూడా రూ. 40 వేల కోట్లు కేటాయించారు.


 శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి..


రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు


మూల ధన వ్యయం 33,487 కోట్లు


సాగునీటి పారుదల శాఖకు రూ.26 వే కోట్లు


సంక్షేమానికి రూ. 40 వేల కోట్లు


రోడ్లు భవనాలకు రూ.5,790 కోట్లు


హోం శాఖకు 9,564 కోట్లు


గృహజ్యోతి పథకానికి రూ.2418 కోట్లు


వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు


హార్టికల్చర్ రూ.737 కోట్లు


పశుసంవర్ధక శాఖకు రూ. 19,080 కోట్లు


మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723 కోట్లు


ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,836 కోట్లు


పంచాయతీ రాజ్ శాఖకు 29,816 కోట్లు


మహిళా శక్తి క్యాంటీన్ రూ.50 కోట్లు


హైదరాబాద్ అభివృద్ధికి రూ. 10,000 కోట్లు


జీహెచ్‌ఎంసీకి రూ.3,000 కోట్లు


హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు


మెట్రో వాటర్‌కు రూ. 3,385 కోట్లు


హైడ్రా రూ.200 కోట్లు


ఏయిర్‌పోర్ట్ మెట్రోకు రూ.100 కోట్లు


ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు


హైదరాబాద్ మెట్రోకు రూ.500 కోట్లు


ఓల్డ్ సిటీ మెట్రో రూ.500 కోట్లు


మూసీ అభివృద్ధికి రూ. 1500 కోట్లు


రీజినల్ రింగ్ రోడ్డు రూ.1500 కోట్లు


స్ర్తీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736


ఎస్సీ,ఎస్టీ సంక్షేమానికి రూ.17,000


మైనారిటీ సంక్షేమం రూ.3,000


బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు


వైద్య ఆరోగ్యం రూ.11,468 కోట్లు


విద్యుత్ రూ.16,410 కోట్లు


అడవులు ,పర్యావరణం రూ.1064 కోట్లు


ఐటీ రూ.774 కోట్లు


నీటి పారుదల రూ.22,301 కోట్లు


విద్య రూ.21,292 కోట్లు


⍟భూమిలేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం.- భట్టి


⍟బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. నంది నగర్‌లోని ఆయన నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్ కాసేపట్లో శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సభకు హాజరవుతున్నారు.


తెలంగాణ బడ్జెట్.. భట్టి స్పీచ్ లైవ్


⍟సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.


⍟ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అంతకు ముందు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్‌లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సమావేశం అయ్యారు. భట్టిని కలిసిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు అభినందనలు తెలిపారు.


⍟ప్రజాభవన్ నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీకి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో భట్టి పాల్గొననున్నారు. అసెంట్లీ కమిటీ హాల్‌లో జరగనున్న కేబినెట్‌ భేటీలో 2024-25 వార్షిక సంవత్సరం బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM