అన్ని వర్గాలకు నిరాశే,,,రైతులకు వెన్నుపోటు పొడిచారు... రాష్ట్ర బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్

byసూర్య | Thu, Jul 25, 2024, 05:44 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్  ఫైరయ్యారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత సభ వాయిదా పడగా.. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పొగిడినట్లే పొగిడి అన్నదాతను వెన్నుపోటు పొడిచారన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీ తయారు చేయలేదని.. కొత్త పథకాల ఊసే లేదని చెప్పారు. ఇది అర్భక ప్రభుత్వమని ఉన్న పథకాలను కూడా తీసేసిందన్నారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని.. ఇందులో చెప్పుకోవటానికి కొత్తగా ఏమీ లేదన్నారు.కాంగ్రెస్ రైతు శుత్రు ప్రభుత్వంగా మారిందని ఫైరయ్యారు. రైతు బంధును ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. గొర్రెల పంపిణీ పథకంపై ఎలాంటి ప్రస్తావన లేదని.. దళితుల స్వాలంబన కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి సైతం మంగళం పాడారన్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలనుకున్నా.. వారి చర్యలు చూశాక ఇక రంగంలోకి దిగాల్సిందేనని నిర్ణయించుకున్నామన్నారు.


'ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీపై క్లారిటీ లేదు. రైతులను పొగిడినట్టే పొగిడి వెన్నుపోటు పొడిచారు. ఆర్థిక మంత్రి వొత్తి వొత్తి పలకటం తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలకు నిరాశే.. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం. ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. దళిత వర్గాల కోసం ప్రవేశపెట్టిన దళితబందు ప్రస్తావనే లేదు. ఆర్థిక మంత్రిది చిల్లరమల్లర ప్రసంగంలా ఉంది. ఐటీ, పారిశ్రామిక శాఖ పాలసీ లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఈ బడ్జెట్‌పై చీల్చి చెండాడుతాం.' అని కేసీఆర్ అన్నారు.


కాగా రూ.2,91,159 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను చదవి వినిపించారు. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా.. మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా పేర్కొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM