ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం.. పక్కనే ఉన్న ఆస్పత్రిలోని రోగుల తరలింపు

byసూర్య | Wed, Jul 10, 2024, 08:19 PM

హైదరాబాద్‌లో మరో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో మెట్రో స్టేషన్ కింద భారీగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. రెండు ఫైర్ ఇంజిన్లను సంఘటనా స్థలానికి పంపించి మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ పక్కనే తపాడియా ఆస్పత్రి ఉండటంతో ఆస్పత్రి వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అక్కడి నుంచి బయటికి తరలించారు.


ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు.. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలోనే ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్‌ వైపు వెళ్లే వాహనాలను మొత్తం ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇక ఆ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఫర్నీచర్ షోరూం ఉండగా.. అందులోకి కూడా మంటలు వ్యాపించడంతో.. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం మంటలు, దట్టమైన పొగతో అలుముకుంది.


Latest News
 

మొక్కలు నాటిన పోలీసు సిబ్బంది Thu, Jul 18, 2024, 03:42 PM
రైతుల సంక్షేమమే లక్ష్యం Thu, Jul 18, 2024, 03:37 PM
జవహర్ నగర్ ఘటన పై ఎంపీ ఈటెల రాజేందర్ సిరియస్ Thu, Jul 18, 2024, 03:36 PM
తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేసిన ముదిరాజు సంఘం సభ్యులు Thu, Jul 18, 2024, 03:34 PM
తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ప్రత్యేక హారతి Thu, Jul 18, 2024, 03:33 PM