చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం

byసూర్య | Wed, Jul 10, 2024, 08:16 PM

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోగా.. కారులో ఓ వ్యక్తితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చెరువులోకి కారు దూసుకెళ్లటాన్ని గమనించిన సాయి అనే వ్యక్తి స్థానికుల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. కారు చెరువులోకి దూసుకెళ్లిన తర్వాత.. అందులోని వారంతా కారు పై భాగానికి చేరుకున్నారు. స్థానికులు ఓ తాడు, ట్యూబ్ సహాయంతో ఒక్కొక్కరిగా బయటకు చేర్చారు. అయితే కారు మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోటంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. అయితే అందులో నుంచి వారిని బయటకు తీసిన తర్వాత షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకునేందుకు వారు చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలిసింది. హైదరాబాద్ బీఎన్ రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఉదయం పిల్లల్ని తీసుకొని కారులో బయల్దేరిన అశోక్.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ గ్రామ శివారులోని చెరువు వద్దకు చేరుకున్నాడు. అనంతరం కారు డోర్లు పూర్తిగా లాక్ చేసి కారును చెరువులోకి పోనిచ్చాడు. అయితే పిల్లలు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేయటంతో అశోక్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది.


కారు పూర్తిగా మునిగిపోతుండగా.. పిల్లలు ముగ్గుర్ని కారు పై భాగానికి చేర్చి వారిని అక్కడ కూర్చొబెట్టాడు. స్థానికుడు సాయి అనే వ్యక్తి ధైర్యం చేసి తాడు సాయంతో ఒక్కొక్కరిగా అందర్నీ బయటకు తీసుకొచ్చారు. అయితే వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశోక్ వివరాలు తెలుసుకున్నారు. అయితే కుటుంబ కలహాల వల్లే అశోక్ తన పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. కాగా, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చాకచక్యంగా వ్యవహరించి నలుగుర్ని రక్షించిన స్థానికుడు సాయిని పలువురు అభినందిస్తున్నారు.


Latest News
 

మొక్కలు నాటిన పోలీసు సిబ్బంది Thu, Jul 18, 2024, 03:42 PM
రైతుల సంక్షేమమే లక్ష్యం Thu, Jul 18, 2024, 03:37 PM
జవహర్ నగర్ ఘటన పై ఎంపీ ఈటెల రాజేందర్ సిరియస్ Thu, Jul 18, 2024, 03:36 PM
తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేసిన ముదిరాజు సంఘం సభ్యులు Thu, Jul 18, 2024, 03:34 PM
తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ప్రత్యేక హారతి Thu, Jul 18, 2024, 03:33 PM