అశ్వారావుపేట సర్కిల్‌లో వరుస విషాదాలు.. మరో ఎస్సై ఆకస్మిక మృతి

byసూర్య | Wed, Jul 10, 2024, 08:13 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది మరవకముందే అశ్వారావుపేటలో సర్కిల్ పరిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో ఎస్సై ఆకస్మికంగా మృతి చెందాడు. దమ్మపేట పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సీమా నాయక్ హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలోనే గుండెపోటుకు గురికాగా.. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఎస్సై సీమా నాయక్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. అశ్వారావుపేట సర్కిల్ పరిధిలో వారంలోనే ఇద్దరు ఎస్సైలు ప్రాణాలు కోల్పోవటంతో పోలీసుల్లో తీవ్ర విషాదం అలముకుంది. ఉన్నతాధికారుల వేధింపులతో..


అశ్వారావుపేట స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 30న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందిచగా.. అతడిని ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల పాటు హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రీనివాస్ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.


అయితే చనిపోవటానికి ముందు ఎస్సై శ్రీనివాస్ మరణ వాంగ్మూలం ఇచ్చాడు. సీఐ జితేందర్ రెడ్డితో పాటు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు తనను మానసికంగా వేధించారని ఆరోపించాడు. కులం పేరుతో దూషించటమే కాకుండా తనను అవినీతిపరుడిగా ముద్రవేశారని వాపోయాడు. తనపై వార్తపత్రికల్లో తప్పుడు కథనాలు రాయించి ప్రతిష్ఠ దిగజారేలా వ్యవహరించాడని ఆరోపించారు. ఇదే విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


ఇక ఎస్సై శ్రీనివాస్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ జితేందర్ రెడ్డితో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని విధుల నుంచి తప్పించి వీఆర్‌కు అటాచ్ చేశారు. అయితే ఎస్సై ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.



Latest News
 

కొత్త రేషన్ కార్డుల సర్వే వేళ కన్ఫ్యూజన్.. పాతవి తొలగిస్తారా..? మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ Fri, Jan 17, 2025, 08:15 PM
పుష్ప సినిమా చూసి,,, హీరో స్మగ్లింగ్ చేసే పద్ధతి చూసి,,,హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్ Fri, Jan 17, 2025, 07:52 PM
నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సంచలన నిర్ణయం.. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ Fri, Jan 17, 2025, 07:47 PM
ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ విజయమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ఆదేశాలపై హరీష్ రావు ఇంట్రెస్టింగ్ ట్వీట్ Fri, Jan 17, 2025, 07:41 PM
సింగపూర్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం.. ఓపినింగే అదిరిపోయిందిగా Fri, Jan 17, 2025, 07:36 PM