![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 07:39 PM
హైదరాబాద్ నగర వాసులకు గుడ్‌న్యూస్. నగరంలో ఇప్పటికే అనేక టూరిస్టు స్థలాలు ఉండగా.. త్వరలో మరొకటి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. మరో కేబుల్ బ్రిడ్జిని నిర్మించేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అయింది. హైదరాబాద్ పాతబస్తీకి సమీపంలోని మీరాలం చెరువును టూరిస్ట్ హబ్‌గా మార్చేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు రచిస్తోంది. అవసరమైన పరిపాలన అనుమతులు రావడంతో మిరాలం ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారభించారు. మీరాలం లేక్ ఫ్రంట్ పార్కు అభివృద్ధితో పరిసర ప్రాంతాలు ఆకర్షణీయంగా మారనున్నాయి. మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జిని దుర్గం చెరువు తరహాలోనే నిర్మించనున్నారు. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తి చేసేలా హెచ్ఎండీఏ ఓ కన్సల్టెన్నీ ద్వారా ప్రతిపాదనలు సిద్ధి చేసింది. రూ.381 కోట్ల వ్యవయంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మీరాలం ట్యాంక్ ఈస్ట్ సైడ్‌లో ఉన్న చింతల్‌మెంట్ రోడ్డు నుంచి ట్యాంక్ తూర్పున గల బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే 44ను కనెక్ట్ చేస్తూ బ్రిడ్జి నిర్మించనున్నారు. మెుత్తం నాలుగు లైన్లతో 2.65 కిలోమీటర్ల పొడువుతో ఈ హైలెవల్ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. వంతెన పైన రెండు చోట్ల 140 మీటర్లతో ప్రవేశానికి ర్యాంపులు ఏర్పాుట చేయనున్నారు. ఒక చోట 110 మీటర్లతో ఎగ్జిట్ ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. అలాగే కేబుల్ బ్రిడ్జిపై ఆకర్షణ కోసం అర్నమెంటల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు.
కొత్త నగరానికి పాత నగరానికి వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే మీరాలం చెరువు విశిష్టతను తెలియజేసేలా అక్కడ థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇక పర్యాటకులు వినియోగించేందుకు గాను ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌ను కూడా నిర్మించనున్నరాు. కేబుల్ బ్రిడ్జి సమీపంలోనే ల్యాండ్ స్కేప్ డెవలప్‌మెంట్, టూరిజానికి అనుగుణంగా సందర్శకులను ఆకట్టుకునేందుకు వ్యూ పాయింట్లు, సంస్కృతి, వారసత్వ నేపథ్యాన్ని తెలియజేసేందుకు వివిధ అభివృద్ది పనులు, సమాచార కేంద్రాలు ఏర్పాుట చేసేందుకు హెచ్‌ఎండీఏ రెడీ అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గనుంది.