హీరో సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

byసూర్య | Wed, Jul 10, 2024, 07:42 PM

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ అటు సినిమాలతో పాటు ఇటు రెస్టారెంట్ బిజినెస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'వివాహ భోజనంబు' అనే పేరుతో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆయన రెస్టారెంట్లు ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లు తక్కువ కాలంలోనే ప్రజల అభిమానాన్ని సంపాదించాయి. అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులపై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.జులై 8న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) టాస్క్‌ఫోర్స్ అధికారులు సందీప్ కిషన్ హోటల్‌లో తనిఖీలు చేశారు.


రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించిన అంశాలు..


* రెస్టారెంట్లో బెస్ట్ బిఫోర్ డేట్ (2020) దాటిన చిట్టి ముత్యాలు రైస్ (25 కిలోలు)ను గుర్తించారు. సింథటిక్ కలర్స్‌తో ఉన్న అర కిలో కొబ్బరి తురుమును గుర్తించారు.


* స్టీల్ కంటైనర్‌లలో నిల్వ చేసిన ముడి ఆహార పదార్థాలు & పాక్షికంగా సిద్ధం చేసిన ఆహారాలను కవర్ చేశారు. కానీ వాటిపై లేబుల్ సరిగా లేదు. కొన్ని డస్ట్‌బిన్‌లపై మూతలు లేవు.


* ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవు.


* వంటగది ఆవరణలోని కాలువలలో నీరు నిల్వ ఉంది.


* ఆహార తయారీలో ఉపయోగించిన, వినియోగదారులకు అందించే బబుల్ వాటర్ కోసం నీటి విశ్లేషణ నివేదిక అందుబాటులో లేదు.


* ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్‌నెట్‌లు, యూనిఫాం ధరించి కనిపించారు.


* ప్రాంగణంలో పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయి.


2016లో ప్రారంభం..


‘మా అమ్మ చేతి వంట లాగే నా ఫ్రెండ్ రవి వాళ్ల నాన్న రాజు గారు చేసిన కేటరింగ్‌లో చేసిన ఫుడ్ కూడా నాకు బాగా నచ్చేది. రవి ఓసారి వచ్చి రెస్టారెంట్ పెడదామని అనుకుంటున్నానని చెప్పాను. నేను కూడా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నానని చెప్పి వెంటనే నేను కూడా పెట్టుబడి పెట్టాను. తెలుగు భోజనాలు అనే విషయాన్ని బాగా నమ్ముకొని ఈ రెస్టారెంట్‌ను పెట్టాం. ఒకేసారి 240 మంది కూర్చొని భోజనం చేయొచ్చు. మా రెస్టారెంట్ బయట ప్రతి రోజూ 30-50 మంది వరకు ఫుడ్ అవసరం ఉన్న వాళ్లకు భోజనం పెడతాం. అందరికీ మంచి తెలుగు భోజనం అందించడం కోసం ఈ రెస్టారెంట్ పెట్టాం’ అని సందీప్ కిషన్ 2016 డిసెంబర్లో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా చెప్పుకొచ్చారు.



Latest News
 

మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM
UPSC సివిల్స్.. తెలుగు అమ్మాయే టాపర్ Tue, Apr 22, 2025, 08:35 PM