byసూర్య | Wed, Jul 10, 2024, 04:26 PM
రుద్రూర్ మండల కేంద్రములోని శశిరేఖ ఫంక్షన్ హాల్ లో బుధవారం ధాత్రి శ్రీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ అఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రక్తదాన శిభీరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రుద్రూర్ మండల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్త దానం చేయడం ఎంతో విలువైన దానం అని ఒకరు రక్తం దానం చేస్తే ఇద్దరు ప్రాణాల్ని కాపాడిన వాళ్లము అవుతామని అన్నారు.