![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 04:10 PM
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం హరిజనవాడ నెంబర్ 2 లో బుధవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం అంగన్వాడి టీచర్ మంగ మాట్లాడుతూ, వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదపడతాయన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో అన్నపాసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిబ్బంది రాధిక, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.