byసూర్య | Wed, Jul 10, 2024, 03:16 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాల రుణమాఫీ పథకంలో ఎలాంటి షరతులు విధించకుండా రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలని అఖిలభారతం ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు యాదగిరి డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ లో బుధవారం ఏఐపీకేయుఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జూలై 22 నుండి 29 వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.