![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 02:44 PM
బీడీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి. వెంకట నారాయణ అన్నారు. బుదవారం ఆదిలాబాద్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ తో ఈ నెల 15న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీడీ కార్మికులకు చేయూత పథకం కింద నాలుగు వేల రూపాయలు చెల్లించాలన్నారు.