![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 10:17 AM
అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం మారమనగాల గ్రామానికి చెందిన ప్రసాద్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. దీనికిగాను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 1. 20 లక్షల చెక్కును బుధవారం ఆయన బాధిత కుటుంబానికి అందజేశారు.