కాళ్ల కిందేసి తొక్కినా.. మీ అహంకారం తగ్గలేదా? కేటీఆర్‌కు టీడీపీ నేత ఘాటు కౌంటర్లు

byసూర్య | Tue, Jul 09, 2024, 10:33 PM

ఏపీ రాజకీయాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ నేతలకు మంట పుట్టిస్తున్నాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు అప్పుడే కౌంటర్లు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సోమిరెడ్డి. అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతోనే మీ కళ్లకు ఉన్న పొరలు ఇంకా తొలగలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు మీకు ముందుగానే గుణపాఠం చెప్పారని.. మిమ్మల్ని కాళ్లకింద పడేసి తొక్కినా కూడా ఇంకా అహంకారం తగ్గకపోవటం ఆశ్చర్యంగా ఉందంటూ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు. అలాగే చంద్రబాబును జైళ్లోకి పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందంటూ సోమిరెడ్డి సెటైర్లు వేశారు.


"పాలనలో తండ్రి ఫామ్ హౌస్‌కు, కొడుకు కలెక్షన్ హౌస్‌కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి" అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.


అయితే ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ ఏపీ రాజకీయాల మీద స్పందించారు. ఏపీలో వైఎస్ జగన్ ఓడిపోవటం ఆశ్చర్యంగా ఉందన్న కేటీఆర్.. ఏపీ ఎన్నికల ఫలితాలు తమకు అంతుబట్టలేదన్నారు. వైఎస్ జగన్ గెలుస్తాడని తమకు నివేదికలు వచ్చాయన్న కేటీఆర్.. ఏం జరిగిందో తెలియదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ.. ఓడిపోవటం అంతుబట్టని అంశమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అలాగే వైఎస్ జగన్‌ ఓడిపోయినా వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్న కేటీఆర్.. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ విడిగా పోటీచేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవంటూ ఏపీ ఎన్నికల ఫలితాలపై తనదైన విశ్లేషణ చేశారు కేటీఆర్.


కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలే టీడీపీ శ్రేణులకు మంటపుట్టిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ఓడించినా కూడా ఇంకా అహంకారం తగ్గలేదంటూ టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో సౌమ్యంగా ఉండే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా.. కాస్త ఘాటుగా కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు కేటీఆర్ పెట్టిన ట్వీట్.. బీఆర్ఎస్ పార్టీ కొంపముంచిందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM