హైదరాబాద్‌లో వైరల్ ఫ్లూ విజృంభణ.. లక్షణాలు ఇవే, ఈ జాగ్రత్తలు తీసుకోండి

byసూర్య | Tue, Jul 09, 2024, 08:01 PM

వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. డెంగీ, మలేరియా వంటి రోగాలతో పాటు కొత్త కొత్త వైరస్‌లో ప్రజలను అటాక్ చేస్తుంటాయి. హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో గత వారం రోజులుగా రోజుకు 600 నుంచి 800 వైరల్ ఫ్లూ లేదా సీజనల్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇవి సీజనల్ ఫ్లూ, ఇన్‌ఫ్లూయెంజా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వచ్చే జ్వరాలుగా డాక్టర్లు గుర్తించారు. వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతో తీవ్రమైన న్యుమోనియాతో పాటు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు దారితీస్తుందని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డేటా ప్రకారం.. ఇన్‌ఫ్లూయెంజా A (H1N1), A (H3N2) కేసులు పెరుగుతున్నట్లు వెల్లడైంది. గత పది రోజులుగా ఇలాంటి కేసులు పెరుగుతున్నట్లు తేలింది. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఇమ్యునోలాజికల్ మార్పుల కారణంగా ఇప్పుడు సాధారణ ఫ్లూ కూడా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లకు దారి తీస్తున్నాయన్నారు.


లక్షణాలు ఇవే..


ఇవి వాతవరణం మార్పుల కారణంగా వస్తున్నాయని.. జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, కండ్లకలక, దగ్గు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు. మూడు రోజుల కంటే ఎక్కువ కాలం లక్షణాలు కొనసాగితే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. జ్వరం, తుమ్ములు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, దగ్గు, శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీలో మంట, శరీర నొప్పులు, నీరసం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఫ్లూ యొక్క ముఖ్య లక్షణాలుగా వెల్లడించారు.


ఈ జాగ్రత్తలు తీసుకోండి..


అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వటం వారితో ఆహారం, నీరు లేదా బట్టలు పంచుకోవడం వంటివి చేయకూడదు.


తరచుగా చేతులు కడుక్కోవాలి. మరియు హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలి.


డోర్ హ్యాండిల్స్, టేబుల్ టాప్‌లు, రెయిలింగ్‌లు వంటి వాటిని తాకటం చేయరాదు.


తుమ్మేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు నోటికి చేతులు, లేదా జేబు రుమాలు అడ్డు పెట్టుకోవాలి.


డిస్పోజబుల్ టిష్యూలను ఉపయోగించాలి. అలాగే వాడిని తర్వాత వాటిని జాగ్రత్తగా పడేయాలి.


అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 108 అంబులెన్స్ సేవలకు కాల్ చేయాలి.


ఫ్లూ షాట్ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచిదిచిన్న పిల్లలు, వృద్ధులు గుండె లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, ఆస్తమా రోగులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణీలకు స్వైన్ ఫ్లూ వంటివి సోకితే.. గర్భస్రావాలు అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రుల్లో 'ఫ్లూ షాట్ వ్యాక్సిన్' అందుబాటులో ఉంటుందని.. ఏడాదికి ఒక్కసారి ఈ టీకా తీసుకోవాలని చెబుతున్నారు.


Latest News
 

హయత్‌నగర్‌కు మెట్రో రైలు.. గుడ్ న్యూస్ వినిపించిన సీఎం రేవంత్ రెడ్డి Sun, Jul 14, 2024, 08:04 PM
నీ అక్రమాలు త్వరలోనే బయట పెడతా.. నువ్వు మొగోనివైతే ఆ పని చేయ్: పాడి కౌశిక్ రెడ్డి Sun, Jul 14, 2024, 07:52 PM
కాలువ పక్కన అర్ధరాత్రి క్షుద్రపూజలు.. గుడిసె వేసి, పెద్ద గొయ్యి తీసి Sun, Jul 14, 2024, 07:49 PM
పార్టీ అభివృద్ధికి సైనికులుగా పని చేయాలి Sun, Jul 14, 2024, 07:40 PM
గదిలో బంధించి 20 కుక్కల్ని వదిలి.. 3 రోజులు చిత్రహింసలు Sun, Jul 14, 2024, 07:38 PM